దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
తాజాగా, తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం యూనిలీవర్ ప్రతినిధులతో ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చింది. అలాగే, బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సిద్ధంగా ఉందని కంపెనీ వెల్లడించింది.
తెలంగాణకు ఆర్థిక వృద్ధిలో కొత్త అవకాశం
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పని దొరికే అవకాశాలు పెరుగుతాయని, వినియోగ వస్తువుల రంగంలో తెలంగాణను ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.