ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్కౌంటర్ నిన్న గరియాబంద్ డీఆర్ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) మరియు ఒడిశా ఎస్‌వోజీ (స్పెషల్ ఆపరేషన్ గ్రూప్) దళాలు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో తమ సిబ్బందిలో ఒకరు గాయపడినట్లు వెల్లడించారు.
అదేవిధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.