‘ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్’ ఫ్యామిలీని టార్గెట్ చేశారా? కార‌ణ‌మేంటి?

'ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్' ఫ్యామిలీని టార్గెట్ చేశారా? నిజ‌మేంటి?

ఆంధ్ర రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌లు చేస్తున్న ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్ విజ‌య్ కేస‌రి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విజ‌య్ కేస‌రి ఫ్యామిలీ నిర్వ‌హించే బిజినెస్‌పై దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు. ఇటీవ‌ల కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ల‌డ్డూ వివాదం విశ్లేష‌ణ‌తో ఫేమ‌స్ అయిన విజ‌య్ కేస‌రి.. ఆ త‌రువాత ఏపీలో జ‌రిగే రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై లాజిక్‌గా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ నెటిజ‌న్ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు.

2023 జూన్ 15 నుంచి విజ‌య్ కేస‌రి వీడియోలు చేస్తున్న‌ప్ప‌టికీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌ వీడియోల‌కు ఆద‌ర‌ణ పెరగ‌డంతో అది జీర్ణించుకోలేని కొంద‌రు విజ‌య్ కుటుంబ వ్యాపారాల‌ను టార్గెట్ చేశారు. వారి కుటుంబ స‌భ్యులనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు నిందలు మోపుతున్నారు. ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్ కుటుంబానికి My Toddler Foods బిజినెస్ ఉంది. ఈ సంస్థ ద్వారా పసిపిల్ల‌లకు అందించే ఆహార ప‌దార్థాల విష‌యంలో త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని క‌ల్పిస్తున్నారు. ఈ సంస్థ 2023 నుంచి కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ, తాజాగా ఆ వ్యాపార సంస్థ‌పై ఓ వ‌ర్గం దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టింది.

విజ‌య్ కేస‌రి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సౌత్ డిజిట‌ల్ మీడియా ట్విట్ట‌ర్ హ్యాండిల్ లోకేశ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ వ‌రుస ట్వీట్లు చేస్తోంది. పసిపిల్లలకు ఆహార పదార్థాల స్కామ్ బట్టబయలు, కేసు న‌మోదు చేయాలంటూ హ‌డావిడి సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది. విజ‌య్‌ని ఏమీ చేయ‌లేక ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్ చేశార‌ని, ఎవరైనా బహిరంగంగా నిజాలు చెబితే టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఆయ‌న కుటుంబంపై త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment