మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన డ్రోన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేయగా, అది ఏపీ వైబర్ నెట్ డ్రోన్‌గా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఆ శాఖ అధికారులు డ్రోన్ ఎగరేసినట్లుగా తేల్చారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో ప్రభుత్వం అధ్యయనం మొదలుపెట్టింది. దీంతో మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించి ఫిర్యాదు చేయగా, రెండు రోజులుగా డ్రోన్ వ్యవహారంపై పోలీసుల లోతైన విచారణ చేపట్టి అది ఏపీ ఫైబర్ నెట్ డ్రోన్‌గా తేల్చారు.
మన్యం జిల్లాలో ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో నకిలీ ఐపీఎస్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి తోడు తాజాగా జనసేన ఆఫీస్‌పై డ్రోన్ ఎగరడంపై పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం పరుస్తుండగా, డ్రోన్ వ్యవహారంపై పోలీసులు వారికి ఉపశమనం కలిగించే వార్త అందించారు.