---Advertisement---

అభిమానులకు శుభవార్త.. ష‌మీ రీఎంట్రీ

అభిమానులకు శుభవార్త.. ష‌మీ రీఎంట్రీ
---Advertisement---

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో ప్రారంభమవనున్న టీ20 సిరీస్‌లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పటిష్టమైన క్రికెట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. షమీ నెట్స్‌లో సహ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తరువాత అతను అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం క్రికెట్ అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది.

మోకాలి గాయం త‌రువాత ష‌మీ జ‌ట్టుకు దూరం అయ్యాడు.దేశ‌వాళీ లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడిన ష‌మీ తిరిగి జాతీయ జ‌ట్టులోకి రావ‌డంపై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ కోసం బీసీసీఐ స్పెషల్ పోస్ట్
‘షమీ ఈజ్ బ్యాక్’ అంటూ బీసీసీఐ తన అధికారిక X అకౌంట్‌లో (ట్విట్టర్) ఒక వీడియోను పోస్ట్ చేసింది. 2023 ODI వరల్డ్ కప్ తర్వాత షమీ జాతీయ జట్టులోకి వచ్చి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ వార్త క్రికెట్ ప్రేమికుల్ని మరింత ఉత్సాహపరిచింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment