తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. తెలంగాణ మరియు హైదరాబాద్‌లోని పెట్టుబడుల అవకాశాలను గురించి వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వారికి ఆహ్వానించారు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు పయనం
సింగపూర్ పర్యటన ముగిసిన వెంటనే, ఆ బృందం నేరుగా స్విట్జర్లాండ్‌లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయలుదేరింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలను తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలోని వనరులను పారిశ్రామిక వేత్తలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించనున్నారు. ఈ సందర్భంలో పలు దిగ్గజ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం సమావేశం కానుంది.