కోల్‌కతాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాలతీ రాయ్ మాట్లాడుతూ.. “ఒక మహిళగా మరియు ముగ్గురు కూతుళ్ల తల్లిగా బాధితురాలి వేదన నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఆమె కూడా నాకు కూతురులాంటిదే. కోర్టు నా కొడుకును ఉరి శిక్ష విధించినా, నేను ఎదురుచెప్పను” అని తెలిపారు. ఈ మాటలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. నిందితుడి తల్లి స్పందన ప్రజలను చలింపచేసింది.
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు చేసిన CBI సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అన్ని ఆధారాలను సేకరించిన అనంతరం సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చిన కోర్టు.. సోమవారం శిక్ష ఖరారు చేయనుంది.