విశ్వనాథన్ ఆనంద్‌పై మాగ్నస్ కార్ల్‌స‌న్ సంచలన ఆరోపణలు

విశ్వనాథన్ ఆనంద్‌పై మాగ్నస్ కార్ల్‌స‌న్ సంచలన ఆరోపణలు

Summarize with AI

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌పై నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌స‌న్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా జీన్స్ ప్యాంట్ వివాదంలో తనను టోర్నీ నుంచి బయటకు పంపించేందుకు ఆనంద్‌తో పాటు ఫిడే (FIDE) అధికారులు కుట్ర పన్నారని కార్ల్‌స‌న్ ఆరోపించారు.

ఫిడే అధ్యక్షుడి హెచ్చరిక
ఈ ఆరోపణలపై స్పందించిన ఫిడే అధ్యక్షుడు ఆర్కడీ డ్వోర్కోవిచ్, కార్ల్‌స‌న్‌ను హెచ్చరించారు. “ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి” అని ఆయన సూచించారు. ఈ వివాదం చెస్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. క్రీడల్లో ఉండాల్సిన నీతి, గౌరవం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment