సికింద్రాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్స్ ఇవాళ సాయంత్రం రంగురంగుల పతంగుల సందడి మొదలు కాబోతోంది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. ఈ ఫెస్టివల్‌లో మొత్తం 19 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ తమ ప్రతిభను ప్రదర్శించనుండటం విశేషం. అంతేకాకుండా, భారతదేశంలోని 14 రాష్ట్రాల నుంచి 54 మంది జాతీయ స్థాయి పతంగుల ఫ్లైయర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
కుటుంబంతో వెళ్లాల్సిన బెస్ట్ ఈవెంట్
ఈ ఫెస్టివల్ కేవలం పతంగులకే పరిమితం కాకుండా, వివిధ రాష్ట్రాల రుచికరమైన స్వీట్స్, సాంప్రదాయ కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన అనుభవం కోసం ఇది సరైన చోటు. కైట్ ఫెస్టివల్ నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.