తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద బైక్పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటనతో తిరుమల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి
by K.N.Chary
Published On: January 11, 2025 11:54 pm
---Advertisement---