13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

గ్రేట‌ర్ న‌గ‌రంలో సంక్రాంతి సంబ‌రాల జోరు మ‌రింత పెర‌గ‌నుంది. హైదరాబాద్‌ ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ వేడుకకు భారతదేశం మాత్రమే కాకుండా ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్ వంటి వివిధ దేశాల నుంచి 50 మంది కైట్ ఫ్లయర్స్ హాజరుకానున్నారు. రంగురంగుల పతంగులతో ఆకాశం కళకళలాడనుంది.

కుటుంబ సమేతంగా హాజరుకండి
ఈ పండుగ పతంగులలోని కళాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సంక్రాంతి వేడుకలను మరింత ఆనందంగా చేసుకోవడానికి కుటుంబ సమేతంగా హాజరై ఆకాశంలో పతంగుల విన్యాసాలను చూసి ఆనందించాల‌ని ప్ర‌భుత్వం కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment