హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!

హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!

మ‌ళ‌యాల‌ న‌టి హనీరోజ్ ఇటీవల కేరళ పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో 30 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల్లో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును వయనాడ్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు బాబీ చెమ్మనూరుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హనీరోజ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసు కేరళలో తీవ్ర చర్చకు దారితీసింది.

వీరసింహారెడ్డి సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యారు నటి హనీ రోజ్‌. కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని, ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment