అప్పుడు వ‌ద్దు.. ఇప్పుడు ముద్దా..? – బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుపై య‌న‌మ‌ల లేఖ‌ వైర‌ల్

అప్పుడు వ‌ద్దు.. ఇప్పుడు ముద్దా..? - బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుపై య‌న‌మ‌ల లేఖ‌ వైర‌ల్

విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కాకినాడ‌లో ఏర్పాటు చేసే బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఓ లెట‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ లెట‌ర్ టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు 2022 సెప్టెంబ‌ర్ 1వ తేదీన రాసిన‌ట్లుగా తెలుస్తోంది. య‌న‌మ‌ల బ‌ల్క్ డ్ర‌గ్ పార్కును వ్య‌తిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్ప అని యనమల రామకృష్ణుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శికి ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ‌లో అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంద‌ని, బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటు చేస్తే భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపుతుందని, ప్రజలు అంగవైకల్యం, అతిసారం, చర్మ జీర్ణశయ వ్యాధులకు గురైయ్యే ప్రమాదం ఉందని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. వెంట‌నే బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని 2022లో యనమల కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

బ‌ల్క్ డ్ర‌గ్ పార్కు 2022లో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీకి మంజూరైంది. దీని కోసం దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కు కోసం పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ‌ల్క్ డ్ర‌గ్ పార్కు ద‌క్కింది. వైసీపీ సాధించిన బ‌ల్క్ డ్ర‌గ్ పార్కును ఏర్పాటును అడ్డుకోవాల‌ని ఆనాడు చంద్ర‌బాబు త‌న పార్టీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుతో లేఖ రాయించార‌నే ఆరోప‌న‌లు కూడా ఉన్నాయి.

ఏపీలో ప్ర‌భుత్వం మారింది. నేడు అదే బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. గ‌త వైసీపీ పాల‌న‌న‌లో బ‌ల్క్ డ్ర‌గ్ పార్కును వ్య‌తిరేకించిన టీడీపీ, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు మోదీ చేత శంకుస్థాప‌న చేయిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2022లో య‌న‌మ‌ల రాసిన లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. టీడీపీ ద్వంద్వ వైఖ‌రిపై వైసీపీ శ్రేణులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అప్పుడు వ్య‌తిరేకించిన వాళ్లు.. ఇప్పుడెలా బ‌ల్క్ డ్ర‌గ్ పార్కును స్వాగ‌తిస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment