ఏపీలో వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపు..

ఏపీలో వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపు..

Summarize with AI

విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. థమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా పెంచిన టికెట్ ధరలు వర్తించనున్నాయి.

ప్రభుత్వ అనుమతి ప్రకారం, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఈ మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. దీంతో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.252కు, సింగిల్ స్క్రీన్‌లలో రూ.197.50కు చేరనుంది. ఈ పది రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు. విడుదలకు ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో చిత్ర బృందానికి ఊరట లభించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment