పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’ చిత్రబృందం ప్రత్యేక వీడియోతో అభిమానులను అలరించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల కావడంతో సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తొలి భాగంలో భైరవ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్న ప్రభాస్.. రెండో భాగంలోనూ అదే పాత్రలో కనిపించనున్నాడనే అంచనాలతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్రబృందం, ఆయనతో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
ఇక ‘కల్కి 2898 ఏడీ’ తొలి భాగంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. సీక్వెల్‌లోనూ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తిరిగి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుండగా, 2027 మధ్య నాటికి చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.








