భార్య సాక్షితో ధోనీ చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాల్సిందే!

భార్య సాక్షితో ధోనీ చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాల్సిందే!

Summarize with AI

టీమిండియా(Team India) మాజీ కెప్టెన్‌, దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) తన భార్య సాక్షితో(Sakshi Dhoni) కలిసి చేసిన ఓ సరదా పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని(Gujarat) జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం (Ambani Family) నిర్వహించిన నవరాత్రి వేడుకలకు (Navratri Celebrations) ఆదివారం (అక్టోబర్‌ 18) ధోనీ(Dhoni), సాక్షి(Sakshi) హాజరయ్యారు. రిలయన్స్‌ గ్రీన్స్‌లో(Reliance Greens) జరిగిన ఈ వేడుకల్లో అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ధోనీ తన భార్య సాక్షికి ఐస్‌క్రీమ్‌ (Ice Cream) తినిపిస్తున్నట్లు నటించి, ఆమె తినబోతున్న సమయంలో దాన్ని వెనక్కి తీసుకుని తానే తినేశాడు. ఇలా రెండు మూడుసార్లు చేయడంతో సాక్షి నవ్వులు చిందించింది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కనిపించే ధోనీ.. భార్యతో ఇలా సరదాగా ఆటపట్టించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఈ యాంగిల్‌ కూడా ఉందా బాసూ!” అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఇక నవరాత్రి వేడుకలకు (Navratri Celebrations) సంబంధించిన ఇతర వీడియోల్లోనూ ధోనీ, సాక్షి, అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ (Radhika Merchant) సందడి చేస్తూ కనిపించారు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక రైడ్లతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. రాత్రి ఆలస్యమైనా ధోనీ దంపతులు కార్యక్రమాలను ఆస్వాదించారు. క్రికెట్‌ మైదానంలో తన ఆటతీరుతో అభిమానులను అలరించే ధోనీ.. వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి సరదా క్షణాలతోనూ నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment