భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సంజయ్ రౌత్‌తో పాటు జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హక్కుల పరిరక్షణలో న్యాయస్థానాలు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంటూ, న్యాయవ్యవస్థపై విమర్శల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్ 12న ప్రతిపక్ష నేతల బృందాన్ని కలిసేందుకు సీజేఐ నిరాకరించారనే నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ కార్యక్రమాలకు న్యాయమూర్తులు హాజరవుతున్నారని, ముఖ్యమంత్రుల విందుల్లో పాల్గొంటున్నారని, ప్రతిపక్ష నేతలను మాత్రం కలవడం లేదని రౌత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
మరోవైపు, నిఖిల్ వాగ్లే తన ఎక్స్ ఖాతాలో సీజేఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. నిఖిల్ వాగ్లే క్షమాపణలు చెప్పగా, తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తాను మాట్లాడటం ఆపబోనని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు. గతంలోనూ పలువురు ప్రముఖులు, మాజీ న్యాయమూర్తులు, రాజకీయ నేతలు సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేశారని, తననే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని రౌత్ ప్రశ్నించారు.








