గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠ, చరణ్‌ల కుటుంబాలను వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. మణికంఠ, చరణ్ చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఇరు కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతులు కోరాపు మణికంఠ, తొక్కాడ చరణ్‌లు కాకినాడ రూరల్ నియోజకవర్గం అశోక్ నగర్, రాజేశ్వరి నగర్‌కి చెందినవారు.
ఈనెల 4వ తేదీన సాయంత్రం రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా సీతానగరం వద్ద ఆక్సిడెంట్ జరిగి మణికంఠ, చరణ్ మరణించారు. మృతుల కుటుంబాలకు చిత్ర యూనిట్, పవన్ పరిహారం ప్రకటించినప్పటికీ, స్థానిక నేతలు, మెగా అభిమాన సంఘాల నేతలెవరూ బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు రాకపోవడం గమనార్హం.