“బ్రతికే ఉన్నావా.. ఇంకా పురుగుల మందు తాగలేదా..?”

“బ్రతికే ఉన్నావా.. ఇంకా పురుగుల మందు తాగలేదా..?”

Summarize with AI

తెలంగాణ‌లో(Telangana) క‌రువుతో(Drought) రైతులు (Farmers) అల్లాడిపోతుంటే.. మ‌రోవైపు అధికారుల కించ‌ప‌రిచే మాట‌లు బ‌తికి ఉండ‌గానే అన్న‌దాత ఉసురు తీస్తున్నాయి. సిద్దిపేట (Siddipet) జిల్లాలోని గజ్వేల్ ఎమ్మార్వో (Gajwel MRO) స్వామి (Swamy) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్లిన ఓ రైతును (Farmer) ఎమ్మార్వో అవహేళన చేశారంటూ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. రైతుతో ఎమ్మార్వో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన వ్యవసాయ భూమి(Agricultural Land), జీవనోపాధికి సంబంధించిన సమస్యతో ఎమ్మార్వోను కలిసిన సమయంలో తనను అవమానించారని (Insulted) రైతు ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంకా పురుగుల మందు (Pesticide) తాగలేదా.. బ్రతికే ఉన్నావా?” అంటూ ఎమ్మార్వో మాట్లాడిన వీడియోపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

తన పరిస్థితి చూసి నవ్వు వస్తుందా అని రైతు ప్రశ్నించగా, “అవును వస్తది.. బరాబర్ వస్తది” అంటూ ఎమ్మార్వో సమాధానం ఇవ్వ‌డం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్న రైతుకు అండగా నిలవాల్సిన అధికారులు ఇలా వ్యవహరిస్తారా అంటూ పలువురు మండిప‌డుతున్నారు. రైతుల సమస్యలను సానుభూతితో విని, చట్టపరంగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, వైరల్ అవుతున్న వీడియోలోని అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment