మోదీపై నాడు నిప్పులు.. నేడు మైత్రి ముద్దులు.. చంద్రబాబు పాత ట్వీట్‌ డిలీట్‌తో కొత్త చర్చ!

మోదీపై నాడు నిప్పులు.. నేడు మైత్రి ముద్దులు.. చంద్రబాబు పాత ట్వీట్‌ డిలీట్‌తో కొత్త చర్చ!

Summarize with AI

రాజకీయాల్లో మారిన సమీకరణాలకు సోషల్‌ మీడియా పాత పోస్టులు అద్దం పడుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 16న అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. “మోదీ భారతదేశ ప్రతిష్టాత్మక సంస్థలను వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. బీజేపీ(BJP) పాలనలో సంస్థల స్వయంప్రతిపత్తి(Institutional Autonomy), ప్రజాస్వామ్యం (Democracy) దాడికి గురయ్యాయి. సీబీఐ(CBI) నుంచి ఆర్బీఐ(RBI) వరకు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థ కూడా మినహాయింపు కాదు” అంటూ చంద్రబాబు నాడు ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ 2019 ఏప్రిల్‌ 16న చేసినదేనని పలు మీడియా నివేదికలు కూడా ధృవీకరించాయి.

నాటి విమర్శలు.. నేటి రాజకీయ మైత్రి

2019లో బీజేపీ ప్రభుత్వంపై (BJP Government) తీవ్రంగా విరుచుకుపడిన చంద్రబాబు.. ఆ తర్వాత రాజకీయంగా బీజేపీతో మళ్లీ జతకట్టారు. 2024లో టీడీపీ–బీజేపీ(TDP-BJP) కలిసి ఎన్నికల్లో పోటీ చేయగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ (NDA Government) ఏర్పాటులో టీడీపీ కీలక మిత్రపక్షంగా నిలిచింది. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాటి ట్వీట్‌ను నెటిజన్లు మళ్లీ బయటకు తీసి ప్రస్తుత రాజకీయ వైఖరితో పోల్చుతున్నారు. 2024లో కూడా చంద్రబాబు పాత ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంపై జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. సోషల్‌ మీడియాలో పాత పోస్టును తొలగించడంపై నెటిజన్లు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు.

“అప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట” అంటూ నెటిజన్ల చర్చ

మోదీపై (Modi)2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను, ప్రస్తుతం మోదీతో ఉన్న రాజకీయ భాగస్వామ్యాన్ని పోలుస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా “సీబీఐ నుంచి ఆర్బీఐ వరకు సంస్థల స్వతంత్రత దెబ్బతిన్నదని నాడు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు” అంటూ పాత ట్వీట్‌ను ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ముడిపెడుతున్నారు. ఇలాంటి పాత పోస్టులు రాజకీయ నాయకుల మారిన రాజకీయ పొత్తులు, అప్పటి–ఇప్పటి వైఖరులపై సోషల్‌ మీడియా చర్చకు దారితీస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment