పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. త్రివిక్ర‌మ్‌పై ధ్వ‌జం

పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. త్రివిక్ర‌మ్‌పై ధ్వ‌జం

నటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. “త్రివిక్రమ్‌పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు” అని పేర్కొన్నారు. పూనమ్ తన ట్వీట్‌లో.. “అతను నా జీవితాన్ని నాశనం చేసి, ఆనందంగా లేకుండా చేశాడు. అయినప్పటికీ అతన్ని ఇండస్ట్రీ పెద్ద మనిషిగా ఎలివేట్ చేస్తూ ప్రోత్సహించడం నన్ను బాధిస్తోంది” అని తెలిపింది. ఈ ట్వీట్ సినీ పరిశ్రమలో పలువురి దృష్టిని ఆకర్షించింది. త్రివిక్రమ్‌పై పూనమ్ చేసిన ఆరోపణల‌పై మా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment