---Advertisement---

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
---Advertisement---

రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. శ‌నివారం జ‌రిగిన కేబినెట్ భేటీలో రేవంత్ మంత్రిమండ‌లి కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది.

రైతుల సహకారం, స్పష్టత
రైతు భరోసా పథకం వ్యవసాయ యోగ్యత ఉన్న భూములకు మాత్రమే వర్తించనుంది. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపొందించి, గ్రామసభల ద్వారా ప్రజలకు వివరాలు అందిస్తారని సీఎం తెలిపారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు బాస‌ట‌గా నిలిచేందుకు ఈ పథకాలను ప్రారంభించాం అని సీఎం రేవంత్ అన్నారు. ఈ పథకాలతో వ్యవసాయానికి కొత్త ఊతం ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

పేదల కోసం రేషన్ కార్డుల జారీ
రాష్ట్రంలో రేషన్ కార్డు లేని పేదలకు జనవరి 26 నుంచి కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పేద కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించే అంశంగా తెలుస్తోంది.

  • కేబినెట్‌ నిర్ణయాలు
  • పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు.
  • సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మాజీ మంత్రి రాజనర్సింహ పేరు.
  • మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటి అవసరాలను తీర్చడంపై అధ్యయనం కోసం టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment