మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలంలోని ఏకే-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), సహా పలు ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
