---Advertisement---

బెనిఫిట్ షోల‌పై ప్ర‌భుత్వానికి దిల్‌రాజు స్పెష‌ల్ రిక్వెస్ట్‌..

బెనిఫిట్ షోల‌పై ప్ర‌భుత్వానికి దిల్‌రాజు స్పెష‌ల్ రిక్వెస్ట్‌..
---Advertisement---

తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కొన్ని షరతులతో కూడిన బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం.

హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దిల్‌రాజు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ఇప్పటికే ప్రకటించినట్లు తెలుస్తోంది. సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం, షరతులతో కూడిన బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదని తేల్చిచెప్పింది. అయితే, సినీ పరిశ్రమ అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను రవిగుప్తా స్వీకరించారు. దీనిపై మరింత క్లారిటీ కోసం ప్ర‌భుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

హీరో రామ్‌చ‌ర‌ణ్ – ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌బోతున్న గేమ్ ఛేంజ‌ర్ మూవీని నిర్మాత దిల్‌రాజు త‌న సొంత బ్యాన‌ర్‌పై నిర్మించారు. గేమ్‌ఛేంజ‌ర్‌ భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో, ప్ర‌త్యేక వెసులుబాటు కోసం దిల్‌రాజు స్పెష‌ల్ రిక్వెస్ట్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment