కృష్ణాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. క్లింకారా, తమ్ముడు, చెల్లి ఫొటోలు వైరల్‌

కృష్ణాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. క్లింకారా, తమ్ముడు, చెల్లి ఫొటోలు వైరల్‌

Summarize with AI

శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami)సందర్భంగా సినీ ప్రముఖులు తమ ఇళ్లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ సెలబ్రిటీలు పండుగకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీకి(Mega Family)సంబంధించిన కృష్ణాష్టమి వేడుకల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan), ఉపాసన కొణిదెల(Upasana Konidela) దంపతులు కూడా కృష్ణాష్టమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అందులో ఆమె తన కుమార్తె క్లింకారాతో(Klin Kaara) పాటు కుమారుడు శివరామ్‌(Shivaram), చిన్న కుమార్తె అన్వీరాదేవితో(Anveera Devi) కలిసి పూజా మందిరంలో కనిపించారు. రంగురంగుల పూలతో అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహం ముందు పిల్లలతో కలిసి ఉపాసన సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ‘కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు’ అంటూ ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మెగా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. క్లింకారా, ఆమె తమ్ముడు, చెల్లితో కలిసి ఉన్న ఫొటోలు ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కుటుంబంతో కలిసి సంప్రదాయ పండుగలను జరుపుకోవడంపై రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment