న్యూజిలాండ్‌లో న‌టుడు ప్రిన్స్ పెళ్లి.. వ‌ధువు ఎవ‌రో తెలుసా..

న్యూజిలాండ్‌లో న‌టుడు ప్రిన్స్ పెళ్లి.. వ‌ధువు ఎవ‌రో తెలుసా..

Summarize with AI

సినీ నటుడు ప్రిన్స్‌(Prince) వివాహ బంధంలోకి(Married Life) అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లో(New Zealand) తెలుగు సంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ప్రిన్స్‌ వివాహం(Wedding) వైభవంగా జరిగింది. తన వివాహానికి సంబంధించిన ఫొటోలను ప్రిన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి వేడుకలకు (Wedding Celebrations) సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

న్యూజిలాండ్‌లో స్థిర‌ప‌డిన‌ ఎన్‌ఆర్‌ఐ (NRI) సాయి మాచిరాజుతో (Sai Machiraju) న‌టుడు ప్రిన్స్ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా, తెలుగు ట్రెడిష‌న్‌లో జ‌రిగింది. సినీ ప్రముఖులు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రిన్స్‌ గతంలో ‘బస్టాప్’, ‘రొమాన్స్’, ‘డీజే టిల్లు’ తదితర సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తాజాగా తన వివాహంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆయనకు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment