టీనేజర్ల కోసం ChatGPT కొత్త వెర్షన్.. ఇక తల్లిదండ్రులకు Alerts కూడా!

టీనేజర్ల కోసం ChatGPT కొత్త వెర్షన్.. ఇక తల్లిదండ్రులకు Alerts కూడా!

Summarize with AI

టీనేజర్ల (Teenagers)కోసం ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో(Safety Standards) ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’(ChatGPT for Teens) అనుభవాన్ని ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రకటించింది. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వినియోగదారులకు మరింత వయసుకు తగిన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. ఖాతా వినియోగ విధానం, వయసుకు సంబంధించిన సంకేతాల ఆధారంగా వినియోగదారు 18 ఏళ్లలోపు వారిగా గుర్తిస్తే టీన్‌ ప్రొటెక్షన్స్‌(Teen Protections) ఆటోమేటిక్‌గా అమలులోకి రావచ్చు. గ్రాఫిక్‌ హింస(Graphic Violence), ప్రమాదకర వైరల్‌ ఛాలెంజ్‌లు(Dangerous Viral Challenges), లైంగిక(Sexual) లేదా హింసాత్మక రోల్‌ప్లే(Violent Roleplay), తీవ్ర శరీర సౌందర్య ప్రమాణాలు వంటి సున్నితమైన అంశాలపై చాట్‌జీపీటీ మరింత జాగ్రత్తగా స్పందించేలా రక్షణలు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువసేపు చాట్‌జీపీటీ ఉపయోగించే టీనేజర్లకు విరామం తీసుకోవాలని సూచించే రిమైండర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

చదువుకు (Education) ఉపయోగపడేలా చాట్‌జీపీటీలో స్టడీ మోడ్‌ను (Study Mode) కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో విద్యార్థులకు సమాధానాలను నేరుగా అందించడంకంటే, ప్రశ్నలు అడుగుతూ వారు స్వయంగా ఆలోచించి విషయాన్ని అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేయడం ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులు తమ ఖాతాలను టీనేజర్ల ఖాతాలతో లింక్‌ చేసుకుని క్వైట్‌ అవర్స్‌(Quiet Hours), వాయిస్‌ మోడ్‌(Voice Mode), మెమరీ(Memory), ఇమేజ్‌ జనరేషన్‌ (Image Generation) వంటి కొన్ని ఫీచర్లను నియంత్రించవచ్చు. అయితే తల్లిదండ్రులకు (Parents) పిల్లల పూర్తి చాట్‌ హిస్టరీని చదివే లేదా రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉండదు.

అత్యంత కీలకమైన మార్పుల్లో ఒకటి భద్రతా అలర్ట్‌ వ్యవస్థ. టీనేజర్‌ ఖాతాలో తీవ్రమైన స్వీయహాని ప్రమాదానికి సంబంధించిన సంకేతాలను సిస్టమ్‌ గుర్తిస్తే, ప్రత్యేకంగా శిక్షణ పొందిన సమీక్షకుల చిన్న బృందం ఆ పరిస్థితిని పరిశీలిస్తుంది. తీవ్రమైన ప్రమాద సూచనలు ఉన్నట్లు తేలితే, లింక్‌ చేసిన తల్లిదండ్రులకు ఈమెయిల్‌(Email), ఎస్‌ఎంఎస్‌(SMS) లేదా పుష్‌ నోటిఫికేషన్‌ (Push Notification) ద్వారా అలర్ట్‌ పంపవచ్చు. ఈ చర్యల్లో అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుతూ టీనేజర్ల గోప్యతను కాపాడే విధానాన్ని ఓపెన్‌ఏఐ పేర్కొంది. మొత్తంగా కృత్రిమ మేధస్సును టీనేజర్లు విద్య, సృజనాత్మకత కోసం ఉపయోగించుకునే అవకాశం కొనసాగిస్తూనే, సున్నితమైన కంటెంట్‌, మానసిక ఆరోగ్యం, అధిక వినియోగం వంటి అంశాల్లో అదనపు రక్షణలు కల్పించడమే ఈ కొత్త టీన్‌ అనుభవం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment