టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నటనతో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. అయితే, ఆయన వారసుడు గౌతమ్ సినిమాల్లో విజయాన్ని సాధించలేకపోయినా, వ్యాపార రంగంలో తన సత్తా చాటాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన గౌతమ్, ఆ తర్వాత బసంతి, మను చిత్రాల్లో నటించాడు. అయితే, ఈ సినిమాలు అతనికి పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో గౌతమ్ తన దృష్టిని పూర్తిగా వ్యాపారాల వైపు మళ్లించారు.
సంపాదనకు నూతన గతి..
గౌతమ్ హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బెంగళూరులో రెస్టారెంట్లను స్థాపించారు. వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఐటీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, వాటి ద్వారా ఏడాదికి రూ.360 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. గౌతమ్ వ్యాపార విజయం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా, గౌతమ్ తన తండ్రి బ్రహ్మానందం తో కలిసి మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వార్త గౌతమ్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది.