---Advertisement---

సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహ‌న్ ఫైర్‌

సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహ‌న్ ఫైర్‌
---Advertisement---

ఏపీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రాలైన‌ తమిళనాడు, కర్ణాటకలో లేని వర్గీకరణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే ఎందుకు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల‌న చంద్ర‌బాబు చెడ్డీ ఊడిపోతుంద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. విశాఖ‌లో చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ సర్వేలో తప్పుడు లెక్కలు రాస్తున్నారన్నారు.

ప్రతి ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారని, వాళ్ల కోసం కూట‌మి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేయాల‌ని సూచించారు. ప్రతి విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌న్నులు వేస్తున్నార‌ని, చంద్రబాబు దీనిపై మాట్లాడాల‌ని సూచించారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలని కోరారు. విశాఖ నుంచేఎస్సీలు రోడ్ల పైకి వస్తారన్నారు. భారత రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మారుసున్నారని ఆరోపించారు. ఈవీఎంల‌ ట్యాంపరింగ్ వల్ల ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయని, ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేప‌ర్ ముద్దు అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం చాలా ఈజీ అని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment