---Advertisement---

ఖేల్‌ర‌త్న‌, అర్జున అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. మెరిసిన తెలుగు తేజాలు

ఖేల్‌ర‌త్న‌, అర్జున అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. మెరిసిన తెలుగు తేజాలు
---Advertisement---

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అర్జున అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌క అర్జున అవార్డుల‌కు ఇద్దరు తేజాలు ఎంపిక అయ్యారు. వారిలో అథ్లెటిక్స్ విభాగం లో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తిలు అర్జున అవార్డుకు ఎంపిక‌య్యారు. అదే విధంగా ఖేల్‌ర‌త్న అవార్డుల‌కు ఈసారి చెస్, హాకీ, పారా అథ్లెటిక్స్, షూటింగ్‌ రంగాల నుండి నలుగురు విజేతలుగా ఎంపిక అయ్యారు.

ఖేల్‌ర‌త్న అవార్డులు వీరికి..

  • గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు (చెస్)
  • హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
  • ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్)
  • మను భాకర్ (షూటింగ్)

    ఈ నలుగురూ ఈనెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ ర‌త్న అవార్డుల‌ను స్వీకరించనున్నారు. అవార్డుతో పాటు రూ.25 లక్షలు, ప్రశంసాపత్రం అందిస్తారు.

    అవార్డుల వెనుక చరిత్ర
    1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా ప్రారంభమైన ఈ అవార్డుకు 2021లో పేరు మార్చి హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గౌరవార్థం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా పునర్నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అర్హులైన క్రీడాకారుల పేర్లను కేంద్రానికి సూచిస్తాయి.

    Join WhatsApp

    Join Now
    ---Advertisement---

    Leave a Comment