ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో కష్టాలను ఎదుర్కొంటున్న రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ భవిష్యత్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. “నేను రోహిత్‌కు దగ్గరగా ఉండి ఉంటే అతడికి ఒకటే సూచన ఇస్తా.. – వెళ్లిపోండి, దూకుడు చూపించండి! ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరు ఆకర్షణీయంగా లేదు. కెరీర్‌పై ఏ నిర్ణయం తీసుకోవాలో అతడే నిర్ణయించాలి. రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటే, నేను షాక్‌కు గురికాను. ఎందుకంటే అతడు కుర్రాడేమీ కాదు” అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశముందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను మరింత బలాన్నిచ్చాయి.
---Advertisement---