‘గేమ్ ఛేంజర్’ నిడివి ఎంత? సెన్సార్ సూచనలు ఏమిటి?

'గేమ్ ఛేంజర్' నిడివి ఎంత? సెన్సార్ సూచనలు ఏమిటి?

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, త‌మిళ సూప‌ర్ హిట్ డైరెక్ట‌ర్‌ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మూవీ మొత్తం నిడివి 2 గంటలు 45 నిమిషాలు 30 సెకన్లు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, సెన్సార్ బోర్డు చిత్ర‌యూనిట్‌కి కొన్ని కీలక మార్పులను సూచించింది. లిక్కర్ లేబుల్స్‌ను CG ద్వారా కవర్ చేయాలని, కొన్ని డైలాగ్‌లకు ప్రత్యామ్నాయ పదాలు ఉపయోగించాల‌ని, ఒక పేరును మార్చడంతో పాటు టైటిల్స్‌లో “పద్మశ్రీ” పదాన్ని తొలగించాల‌ని సూచించింది. సెన్సార్ సూచించిన మార్పుల తరువాత, సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment