రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు యావత్ దేశంలోనే సంచలనంగా నిలిచింది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడు సంవత్సరాల చేతన అనే బాలికను 10 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాలిక పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోవడం వల్ల ఈ ఘటనే చోటుచేసుకుంది.
బాలికను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక అధికారులు కష్టబడి పని చేశారు. బాలిక 150 అడుగుల లోతులో చిక్కుకుపోయినప్పటికీ, అధికారులు అనేక మార్గాలు అన్వేషిస్తూ శతవిధాల ప్రయత్నించారు. చివరకు ఆ బోరు బావికి సమాంతరంగా మరో బావిని తవ్వడంతో అధికారుల ప్రయోగం విజయవంతమై.. బాలిక సురక్షితంగా బయటకు వచ్చింది.
బోరుబావి నుంచి బాలికను సురక్షితంగా బయటకు వచ్చిన వెంటనే, ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక సురక్షితంగా బయటకు రావడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. బాలిక కోసం కష్టవారందరినీ యావత్ దేశమంతా ప్రశంసిస్తోంది.