IPL-2025 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్లు తమ ప్రతిభతో దేశవాళీ టోర్నీలలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే తన అసాధారణ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. 117 బంతుల్లో 181 పరుగులు చేసి లిస్ట్-A క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కి పైగా సాధించిన అతిపిన్న వయస్సు క్రికెటర్‌గా (17 ఏళ్లు, 168 రోజులు)గా నిలిచాడు. ఈ రికార్డు గతంలో యశస్వి జైస్వాల్ (17 ఏళ్లు, 291 రోజులు) పేరిట ఉండేది. ఈ రికార్డును ఆయుశ్ మాత్రే బ్రేక్ చేశాడు.
యువ క్రికెటర్ ఆయుశ్ మాత్రమే కాదు, IPL వేలంలో అమ్ముడుకాకుండా ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా దేశవాళీ టోర్నీల్లో తన ప్రతిభ చూపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు శతకాలు సాధించి, తన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి ప్రదర్శన IPL ఫ్రాంచైజీలకు పునరాలోచన చేయిస్తుందో లేదో చూడాలి.