‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి విడుదలైన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. విక్టరీ వెంకటేశ్ స్వయంగా పాడటమే ఈ పాటకు ఉన్న ప్రత్యేకత. ఆయనతో పాటు భీమ్స్ సిసిరోలియో, రోహిణి సొరట్ ఈ పాటకు గళమిచ్చారు.
భీమ్స్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. గంట క్రితం విడుదలైన ఈ పాట ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా.. రెండు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాట సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాలో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మూవీలో వెంకటేష్ పోలీస్ ట్రైనర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.