బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది, భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్సులో 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్సులో డకౌట్ అయిన ట్రావిస్ హెడ్, రెండో ఇన్నింగ్సులో కూడా జస్ప్రీత్ బుమ్రా చేతిలో కేవలం 1 పరుగుకే వెనుదిరిగాడు. భారత స్టార్ పేసర్ బూమ్రా బంతిని ఎదుర్కోలేక ఆసిస్ బ్యాటర్స్ పెవీలియన్ బాట పడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో బూమ్ బూమ్ బూమ్రా 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ఒత్తడి పెంచేశాడు.
ఆసీస్ బ్యాటింగ్..
కోర్టస్ 8 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 21 పరుగులు, స్మిత్ 13 పరుగులు, ట్రావిస్ హెడ్ 1 పరుగు, మిచెల్ మార్ష్ డకౌట్, కెరీ 2 పరుగులు చేసి పెవీలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి ఆసీస్‌ని పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. మహమ్మద్ సిరాజ్ కీలకమైన 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు, ముఖ్యంగా బుమ్రా మరియు సిరాజ్, తమ స్పెల్‌తో ఆసీస్ బ్యాటింగ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. భారత బౌలింగ్ దళం టెస్టు మ్యాచ్ మలుపు తిప్పే అవకాశాలు సృష్టిస్తోంది.








