సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఎన్ని అంటే..

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఎన్ని అంటే..

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి ఇత‌ర రాష్ట్రాల్లోని వారు కూడా త‌మ సొంత గ్రామాల‌కు రావ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపుతారు. కొంద‌రైతే నెల రోజుల ముందుగానే ప్రీప్లాన్‌తో బ‌స్సు, రైల్ టికెట్ బుక్ చేసుకుంటారు.

కాగా, సంక్రాంతికి సొంతూర్ల‌కు వ‌చ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఓ మంచివార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈసారి ఏకంగా 2400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇది మాత్రమే కాకుండా, ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని స్పష్టం చేశారు. సాధారణ టికెట్ ధరలకే ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక సేవలు పండుగ రోజుల్లో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించి, వారి పండుగ ఆనందాన్ని మరింత విస్తరించేలా సహాయపడతాయని ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment