RAPO23తో కొత్త అవతారం.. డైరెక్టర్‌గా మారిన రామ్!

RAPO23తో కొత్త అవతారం.. డైరెక్టర్‌గా మారిన రామ్!

రామ్ పోతినేని (Ram Pothineni) టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని ఇప్పుడు కెరీర్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హీరోగా అలరించిన రామ్.. ఇక దర్శకుడిగానూ మారబోతున్నారు. తన 23వ చిత్రం #RAPO23తో తొలిసారి మెగాఫోన్ పట్టుకుని కెమెరా ముందు, వెనుక రెండింట్లోనూ తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మే 15 ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం రామ్ (Ram) స్వయంగా పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తన కథను తాను ఊహించిన స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు దొరకకపోవడంతో చివరకు డైరెక్షన్ (Direction) బాధ్యతలను తానే తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఖైదీ’(Khaidi), ‘విక్రమ్ వేద’(Vikram Vedha) ఫేమ్ సామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment