తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘన విజయం సాధించిన తర్వాత నటుడు, టీవీకే(TVK) అధినేత విజయ్(Vijay) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు అత్యంత సన్నిహితుడిగా, వ్యక్తిగత జ్యోతిష్కుడిగా పేరున్న రాధన్ పండిట్ వెట్రివేల్ (Radhan Pandit Vetrivel) ను OSDగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ నియామకం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వీసీకే(VCK) నేత వన్నియరసు(Vanniyarasu),, డీఎండీకే (DMDK) వర్గాలు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని, జ్యోతిష్యాలను ప్రోత్సహించడం సరైంది కాదని విమర్శించారు.
ఈ విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్షను (Floor Test) విజయవంతంగా పూర్తి చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాధన్ పండిట్ వెట్రివేల్ OSD నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు (Cancelled) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది.
ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంత వేగంగా వెనక్కి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.








