సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూత

సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూత

దిగ్గజ పారిశ్రామికవేత్త, సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి 94 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. లింఫోమా అనే బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఒసాము డిసెంబ‌ర్ 25వ తేదీన కన్నుమూశారు. ఈ విషయం తాజాగా సుజుకి సంస్థ అధికారికంగా ప్రకటించింది. జపాన్‌లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన ఒసాము, సుజుకి వ్యవస్థాపక కుటుంబంలోని అమ్మాయి షోహో సుజుకిని పెళ్లి చేసుకున్నాడు.

సుజుకీ కుటుంబానికి వారసులు లేకపోవడంతో వారి వివాహం తర్వాత ఆయన పేరు చివరన సుజుకీ చేరింది. ఆ తర్వాత సుజుకీ కంపెనీ పగ్గాలు చేపట్టారు. కార్లు, ద్విచక్రవాహనాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో ఒసాము కీలక పాత్ర పోషించారు. సుజుకి సంస్థను సుమారు 40 సంవత్సరాలు నడిపించిన ఒసాము, 2021లో 91వ వయస్సులో తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. అయితే, 2015లో సుజుకి అధ్యక్ష పదవిని తన కుమారుడికి అప్పగించారు, కానీ తన అనుభవం ఇంకా సంస్థకు విలువైన మార్గదర్శకత్వం అందించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment