చాలా కాలం తర్వాత హీరో సూర్య (Suriya) పూర్తిస్థాయి మాస్ అవతారంలో మెరిశారు. ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘వీర భద్రుడు’ (Veera Bhadrudu) చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ (Trailer) చూస్తుంటే సూర్య మళ్ళీ తన ‘సింగం’(Singam) రోజుల నాటి వింటేజ్ మాస్ పర్ఫార్మెన్స్‌తో వెండితెరపై విధ్వంసం సృష్టించబోతున్నారని స్పష్టమవుతోంది.
ట్రైలర్ విశేషాలు
ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డైలాగులతో సాగింది. చట్టం ముసుగులో అక్రమాలకు పాల్పడే ఒక అవినీతి లాయర్ (ఆర్జే బాలాజీ)ని ఎదుర్కొనే ఒక శక్తివంతమైన పాత్రలో సూర్య కనిపించారు. సినిమాలో సూర్య పాత్రను ‘వీరభద్రుడి’ అంశతో ముడిపెట్టి చూపించడం, మైథాలజికల్ టచ్ ఉన్న మాస్ ఎలిమెంట్స్ భక్తులకు, ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష కాంబినేషన్ తెరపైకి రావడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కైవసం చేసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణల్లో(Telangana) ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్లు దక్కనున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘వీర భద్రుడు’ ఈ గురువారం, మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.








