ఆర్థిక నేరాలతో జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్.. క్రిస్మస్ సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్‌తో పాటు ఓ ప్రేమ లేఖను పంపించాడు. సుఖేశ్, ఆమెకు పారిస్‌లో ఉన్న ఒక విలాసవంతమైన వైన్ యార్డ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. జాక్వెలిన్ పట్ల తన ప్రేమను వ్యక్త పరుస్తూ లేఖ రాశాడు.
సుఖేష్ లేఖలో..
‘‘బేబీ గర్ల్.. మేరీ క్రిస్మస్ మై లవ్. మనిద్దరికీ ఎంతో ఇష్టమైన పండగ ఇది. కాకపోతే మనిద్దరం కలిసి జరుపులేకపోతున్నాం. ఏది ఏమైనా మన మనసులు ఎంతో చేరువయ్యాయి. నీ చేతులు పట్టుకొని అందమైన నీ కళ్లల్లోకి చూస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలని ఉంది. దూరంగా ఉన్నప్పటికీ నేను నీ శాంతాక్లాజ్‌ను కాకుండా ఎవరూ ఆపలేరు. ఈ ఏడాది నీకు చాలా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. ఈరోజు నీకు వైన్ బాటిల్ గిఫ్ట్‌గా ఇవ్వడం లేదు. నువ్వు ఎప్పుడూ కలలు కనే కంట్రీ ఆఫ్ లవ్‌గా అభివర్ణించే పారిస్‌లో ఒక వైన్ యార్డ్‌నే కానుకగా ఇస్తున్నా. ఆ తోటలో నీ చేయి పట్టుకొని నడవాలని ఉంది. నేనొక పిచ్చోడినని ఈ ప్రపంచం అనుకోవచ్చు. నీ ప్రేమలో నిజంగానే నేను పిచ్చోడిని అయ్యా. నేను విడుదలయ్యే వరకూ ఎదురుచూస్తూ ఉండు. ఆ తర్వాత ఈ ప్రపంచమే మన జంటను చూస్తుంది’’ అని రాసుకొచ్చాడు.
సుఖేశ్ ఈవిధంగా లేఖలు రాయడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన గతంలోనూ జాక్వెలిన్‌కు ప్రేమ లేఖలు పంపించాడు. సుఖేశ్ ప్రస్తుతం ఢిల్లీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్, సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చగా మారింది.