‘మార్గదర్శి’కి సుప్రీంకోర్టు షాక్‌.. “రామోజీ చనిపోయినా బాధ్యత ముగిసిపోదు”

'మార్గదర్శి'కి సుప్రీంకోర్టు షాక్‌.. "రామోజీ చనిపోయినా బాధ్యత ముగిసిపోదు"

మార్గదర్శి ఫైనాన్షియర్స్ (Margadarsi Financiers) అక్రమ డిపాజిట్ల (Illegal Deposits) సేకరణ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక ఆదేశాలు జారీ చేసింది. రామోజీరావు (Ramoji Rao) మరణించిన నేపథ్యంలో ఈ కేసును క్లోజ్ చేయాలన్న మార్గదర్శి తరపు న్యాయవాదుల విన్నపాన్ని ధర్మాసనం అంగీకరించలేదు. ఒక ఆర్థిక సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినప్పుడు, ఆ సంస్థ ప్రమోటర్ మరణించినంత మాత్రాన బాధ్యత ముగిసిపోదని కోర్టు స్పష్టం చేసింది.

ఆస్తుల అటాచ్‌మెంట్‌పై హెచ్చరిక
కేసు విచారణ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రామోజీరావు చనిపోయినందున ఈ కేసును ఇకపై మెయింటైన్ చేయలేమని, కాబట్టి విచారణను నిలిపివేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. “ఒకవేళ రామోజీరావు లేనందున కేసు నడపలేమని మీరు అంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి, ఆ నిధులను బాధితులకు పంచుతాం” అని వ్యాఖ్యానించింది.

కోర్టు వ్యాఖ్యలతో స్పందించిన ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi).. తాము ఇప్పటికే డిపాజిటర్లందరికీ చెల్లింపులు పూర్తి చేశామని కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, అందరికీ చెల్లింపులు చేసినట్లు సమాచారం ఉంటే, ఆ వివరాలతో కూడిన పూర్తిస్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశించింది. త‌దుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశమైంది.

కేసు నేపథ్యం ఇదీ..
ఆర్బీఐ(RBI) నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుమారు 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఫిర్యాదు చేశారు. రామోజీరావు మరణం తర్వాత ఈ కేసు కొనసాగదని పేర్కొంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఉండవల్లి తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ వాదనలు వినిపించగా, విచారణను స్వీకరించిన కోర్టు.. ఆర్బీఐ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు శైలజ కిరణ్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment