మహిళలకు లోక్‌సభలో 272 సీట్లు – కేంద్ర మంత్రి మేఘ్‌వాల్

మహిళలకు లోక్‌సభలో 272 సీట్లు - కేంద్ర మంత్రి మేఘ్‌వాల్

దేశ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని విప్లవాత్మకంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (131st Constitutional Amendment Bill) ద్వారా లోక్‌సభ (Lok Sabha) స్థానాల సంఖ్యను భారీగా పెంచుతూ, అందులో మహిళలకు(Women’s) 33 శాతం రిజర్వేషన్లు (33 Percent Reservations) కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (Arjun Ram Meghwal) కీలక వివరాలను వెల్లడించారు.

850కి చేరనున్న లోక్‌సభ స్థానాలు
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలను గరిష్ఠంగా 850కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా నియోజకవర్గాల పరిధి తగ్గి, ప్రజలకు ప్రాతినిధ్యం మరింత చేరువవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రాల నుంచి 815 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (UTs) నుంచి 35 స్థానాలు క‌లిపి 850 ఎంపీ సీట్లు కానున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల కంటే 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉంది.

మహిళలకు 272 రిజర్వ్‌డ్ సీట్లు
మొత్తం 850 స్థానాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా.. లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు (272 Seats) రిజర్వ్ అవుతాయని మేఘ్‌వాల్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు అని, దీనివల్ల దేశ నిర్ణయాధికారాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్ల అనుసంధానం
గతంలో చేసిన చట్టం ప్రకారం.. జనాభా గణన (Census) పూర్తయ్యాక జరిగే డీలిమిటేషన్ (Delimitation) తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే, తాజా 131వ సవరణ బిల్లు ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి, 2029 సాధారణ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ రిజర్వ్‌డ్ సీట్లు రొటేషన్ పద్ధతిలో వివిధ నియోజకవర్గాలకు మారుతూ ఉంటాయని బిల్లులో పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదనలపై సభలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెజారిటీ స్థానాలను పెంచుతూ మహిళలకు పెద్దపీట వేయడంపై ఒకవైపు హర్షం వ్యక్తం అవుతుండగా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై విపక్షాలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment