గుకేశ్‌ను సత్కరించిన సూపర్ స్టార్ రజనీకాంత్

గుకేశ్‌ను సత్కరించిన సూపర్ స్టార్ రజనీకాంత్

Summarize with AI

భారత చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజు తన అద్భుత ప్రతిభతో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అవతరించి దేశం గర్వపడేలా చేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ గుకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయనను సత్కరించారు.

రజనీ ఇంటికి గుకేశ్ కుటుంబంతో స‌హా వెళ్లారు. రజనీకాంత్‌తో గ‌డిపిన దృశ్యాల‌ను గుకేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. రజనీతో పాటు, ప్రముఖ హీరో శివ కార్తికేయన్‌తో కూడా గుకేశ్ భేటీ అయ్యారు. ఈ అరుదైన సందర్భానికి సంబంధించిన ఫొటోలను కూడా గుకేశ్ అభిమానులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమం గుకేశ్ జీవితంలో మరింత గుర్తుండిపోయే అనుభవంగా నిలిచింది. చెస్ ఆటలో ప్రతిభ చూపించి, భారతీయ క్రీడాకారుల కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఎగురవేసిన గుకేశ్‌ను అభినందించేందుకు రజనీకాంత్ చూపిన ప్రేమ అనేక మందికి స్ఫూర్తినిస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment