రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే పరపతి ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే బెదిరించే స్థాయికి చేరింది. ఎమ్మెల్యేని నీ ఇంటికి వచ్చి తంతా అనే లెవల్‌లోకి వెళ్లారంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, అధికారుల గతి ఏంటో ఇట్టే అర్థం అయిపోతుంది అంటున్నారు ప్రజలు.
ఎన్టీఆర్ జిల్లా (NTR District) తిరువూరు నియోజకవర్గ (Tiruvuru Constituency) తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) లక్ష్యంగా సొంత పార్టీకి చెందిన కేశినేని చిన్ని (Kesineni Chinni) వర్గం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా, ఏకంగా భౌతిక దాడులకు దిగుతామంటూ హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఇంటికొచ్చి తంతాం.. మీడియా ముందే హెచ్చరిక
తిరువూరు టీడీపీ(TDP) పంచాయితీ ఇప్పుడు వీధిన పడింది. నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దేవదత్ మీడియా సాక్షిగా ఎమ్మెల్యే కొలికపూడిపై విరుచుకుపడ్డారు. “నీ ఇంటికొచ్చి తంతా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బెల్ట్ షాపుల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడాన్ని దేవదత్ తీవ్రంగా తప్పుబట్టారు.
నియోజకవర్గంలో బెల్ట్ షాపులను (Belt Shops) అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించడంపై దేవదత్ (Devadath) మండిపడ్డారు. “రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతుందో, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది.. అడ్డుకోవడానికి నువ్వు ఎవడవు?” అంటూ ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వైఖరి వల్ల పార్టీ పరువు పోతోందని, మూడు ప్రధాన అంశాల్లో ఆయనను అడ్డుకుని తీరుతామని దేవదత్ ప్రకటించారు.
బహిరంగ చర్చకు సవాల్
బెదిరించడమే కాకుండా ఎమ్మెల్యేకి టీడీపీ నేత ఏకంగా బహిరంగ సవాల్ విసరడం గమనార్హం. ఎంపీ కేశినేని చిన్ని తన దగ్గర డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేసిన దేవదత్, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అభివృద్ధి, ఇతర వ్యక్తిగత అంశాలపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేయడం సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేకి తెలియని అభివృద్ధి ఏముంటుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయినా, క్యాడర్ ఏకంగా ఎమ్మెల్యేను బెదిరించే స్థాయికి వెళ్లడంతో తిరువూరు టీడీపీలో పరిస్థితి రసవత్తరంగా మారింది.
కొలికపూడి శ్రీనివాస్ నీ ఇంటికొచ్చి తంతా
— Telugu Feed (@Telugufeedsite) April 13, 2026
బెల్టు షాపులు అడ్డుకోడానికి నువ్వు ఎవడి..
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి కేశినేని చిన్ని వర్గం వార్నింగ్
ఎమ్మెల్యే ని ఇంటికొచ్చి తంతా అంటూ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ తిరువూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దేవదత్
బెల్ట్ షాపుల్ని నువ్వు… pic.twitter.com/TFKNPnCkVj








