హనియా హత్య.. ఇజ్రాయెల్ ప్రకటనపై ఇరాన్‌ ఆగ్రహం

హనియా హత్య.. ఇజ్రాయెల్ ప్రకటనపై ఇరాన్‌ ఆగ్రహం

Summarize with AI

హమాస్ చీఫ్ ఇస్మాయెల్‌ హనియాను తాము హత్య చేశామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ధృవీకరించిన నేపథ్యంలో ఇరాన్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవాని ఈ హత్యను “హేయమైన ఉగ్రవాద చర్య”గా అభివర్ణించారు. ఈ చర్యకు ప్రతిగా తాము క్షిపణి దాడులు చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. హనియాను టెహ్రాన్‌లో హత్య చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

సిరియా నుంచి కొత్త హెచ్చరికలు
ఇరాన్‌ వ్యవహారాలపై సిరియా కొత్త విదేశాంగ శాఖ మంత్రి అసద్‌ హసన్‌ అల్‌ షిబాని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, దేశ భద్రతను దెబ్బతీయొద్దని టెహ్రాన్‌కు విజ్ఞప్తి చేశారు. సిరియా ప్రజల ఆకాంక్షలను టెహ్రాన్‌ గౌరవించకపోతే, తీవ్ర ప్రతిక్రియలు ఎదురవుతాయని అన్నారు.

సిరియాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత చిక్కగా మార్చాయి. “భవిష్యత్తులో ఏర్పడే కొత్త పాలనను సిరియా యువత వ్యతిరేకిస్తుంది” అని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సిరియా ప్రభుత్వం తాజా హెచ్చరికలు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment