టాలీవుడ్లో రీరిలీజ్ చిత్రాల మానియా మరోసారి ఊపందుకుంది. గుండెను తడిమే ప్రేమకథల నుండి పవర్ ఫుల్ మాస్ యాక్షన్ సినిమాల వరకు రీరిలీజ్ ట్రెండ్ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, సిద్ధార్థ్ హీరోగా ఆనంద్ రంగా తెరకెక్కించిన ‘ఓయ్’ మూవీ మళ్లీ తెరపై సందడి చేయబోతుంది.
ఓయ్ మళ్లీ వచ్చేస్తోంది
ఈ చిత్రాన్ని జనవరి 1న రీరిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ రీరిలీజ్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. మొదటిసారిగా 2009లో విడుదలైన ఈ సినిమా తన మ్యూజిక్, ఎమోషనల్ నేరేషన్‌తో ఇప్పటికీ చాలా మందికి ప్రత్యేక గుర్తుగా నిలిచింది.
నేనింతే కూడా..
మాస్ మహరాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ చిత్రం జనవరి 26న రీరిలీజ్ కానుంది. 2008లో విడుదలైన ఈ సినిమా రవితేజ అభిమానులకు ఎప్పటికీ ఇష్టమైన చిత్రంగా నిలిచింది.