కారు డ్రైవర్ అతి వేగం కారణంగా హైదరాబాద్ నగరంలో ఒక యువతి దుర్మరణం చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.ఈ ఘటన నగరంలోని నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లాకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల కుమార్తె ఐరేని శివాని (21), గండిపేట్ సీబీఐటీ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. తన స్నేహితుడు వెంకట్‌రెడ్డితో కలిసి స్కూటీపై హాస్టల్‌కి వెళ్తుండగా నానక్‌రాంగూడ రోటరీ నార్సింగ్ సర్వీస్ రోడ్డులో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాని అక్కడికక్కడే మరణించగా, వెంకట్‌రెడ్డి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిర్లక్ష్య డ్రైవర్‌పై చర్యలు
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ శ్రీకాలేష్ (19) నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడి కుమారుడు. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ఘోర సంఘటన జరిగింది. పోలీసులు శ్రీకాలేష్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి కారణమైన స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు.