---Advertisement---

‘నో డిటెన్షన్’ విధానం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

'నో డిటెన్షన్' విధానం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
---Advertisement---

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుతం అమలవుతున్న‌ ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8వ తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ కొత్త మార్గదర్శకాలు విద్యా హక్కు చట్టం ఆధారంగా అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాలు (KV), నవోదయ స్కూళ్లు, సైనిక్ స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

విద్యారంగంపై ప్రభావం!
విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు మరింత శ్రద్ధ పెట్టే విధంగా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నూతన విధానం స్కూళ్లకు కొత్త సవాళ్లను తీసుకురానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment